పోస్ట్‌లు

సన్ ఆఫ్ సత్యమూర్తి | చిత్ర సమీక్ష | Review of Son of Satyamurthy (2015)

చిత్రం
సన్ ఆఫ్  సత్యమూర్తి – Pious Obligation Of A Son ఒక మనిషి అప్పు తీసుకుని, తీర్చకపోవటం చట్టం దృష్టిలో నేరమే కాదు, దేవుడి దృష్టిలో పాపం కూడా. అలా ఎవరి దగ్గరైనా అప్పుచేసిన మనిషి అప్పు తీర్చకుండానే చనిపోతే ఆ పాపం వలన అతనికి స్వర్గంలోకి ప్రవేశం ఉండదు కాబట్టి, తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పించే వాడే కొడుకు కాబట్టి ఆ అప్పు తీర్చి, తండ్రిని పాపవిముక్తుడ్నిచేసే “పవిత్రమైన బాధ్యత”ను (Pious Obligation) కొడుక్కి అప్పగించింది Family Law .. తండ్రి ఆస్తుల మీద హక్కే కాదు అప్పులకు బాధ్యత కూడా కొడుకు తీసుకోవటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం… Pious Obligation కేవలం అప్పులకు సంబంధించినదే కాదు తండ్రి చేసిన పాపం, పుణ్యం అన్నిటిలో బాధ్యతా తీసుకోవటమే.. అలాంటి ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించిన ఒక మంచి కొడుకే విరాజ్ ఆనంద్ S/Oసత్యమూర్తి. విలువలే ఆస్తి గా బ్రతికే తండ్రికి తగిన కొడుకు. అందరిలాగా మానాన్న నాకు అనుభవించటానికి బోల్డంత ఆస్తి ఇచ్చాడు అనకుండా బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు అంటాడు. అలా అనటమే కాదు అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయిన తండ్రి బాధ్యతల్ని కూడా బాధతో కాకుండా ఆనందంగానే స్వీకరిస్తాడు. తండ్రి చనిప...

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి | Srirastu Shubamstu | Song Lyrics | Srirastu Shubamastu (1981)

చిత్రం
శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి కవ్వింతల నుంచి కౌగిలింతల దాక కౌగిలింతల నుంచి కల్యాణం దాకా శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి  కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి కవ్వింతల నుంచి కౌగిలింతల దాక కౌగిలింతల నుంచి కల్యాణం దాకా శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి ప్రేమకు వచ్చే పెళ్ళీడు...  పెద్దలు మెచ్చే మా జోడు లగ్గం కుదిరేదెన్నటికో...  పగ్గాలెందుకు ముద్దాడు ప్రేమకు వచ్చే పెళ్ళీడు...  పెద్దలు మెచ్చే మా జోడు లగ్గం కుదిరేదెన్నటికో...  పగ్గాలెందుకు ముద్దాడు మనసు మనసు మనువాడె...  మనకెందుకులే తెరచాటు నీ అరముద్దులకే విజయోస్తు...  నీ అనురాగానికి దిగ్విజయోస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి ********* చిత్రం : శ్రీరస్తు-శుభమస్తు (1981) సంగీతం : జె. వి. రాఘవులు    గీతరచయిత :  వేటూరి నేపథ్య గానం :  బాలు, సుశీల   

ఏమని తెలిపేది | Emani Telipedi | Song Lyrics | Illalu Priyuralu (1984)

చిత్రం
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది పల్లవి: ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి ఎలా.. ఏమని.. ఏమని ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది చరణం 1: నా బాధ ఇంక తీరేనా..  ఆ గాధ నీకు తెలిసేనా నీ కంటి లేత కన్నీళ్ళు..  నా చేతులార తుడిచేనా మమతే.. మరచి.. ఇక నాలోన నే దాగనా మూగవీ ఆశలు.. గుడ్డివీ ప్రేమలు..  జాలిగా చూడకు... అలా.. చూడకు.. చూడకు ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి ఎలా.. ఏమని.. ఏమని ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది చరణం 2: అనుకోని ఘటన ఆనాడు..  అందించె నిన్ను ఈనాడు మా దీపమై నీవు వస్తే..  ఈ కోవెలే తలుపుమూసే బ్రతుకే.. అలిగే.. ఈ బంధాల కోభారమై సాగనీ జాతకం.. ఆడనీ నాటకం .. జాలిగా చూడకు .. అలా.. చూడకు.. చూడకు ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి ఎలా.. ఏమని.. ఏమని ********** చిత్రం: ఇల్లాలు ప్రియురాలు (1984) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు

నీ తీయని పెదవులు అందకపోతే | Nee teeyani pedavulu | Song Lyrics | Kanchana Ganga (1984)

చిత్రం
నీ తీయని పెదవులు అందకపోతే పల్లవి: నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా లలలలా లలలాలాలా లలలల నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా లాలలా లా ఆ ఆ ఆ... నీవే నీవే నా ఆలాపనా నీలో నేనే ఉన్నా నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా చరణం 1: నీ అందమే... అరుదైనదీ నా కోసమే నీవున్నదీ హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ పగలు రేయి ఊగాలమ్మా పరవళ్ళలో  నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా  నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా  చరణం 2: ఆ... ఆ... ఆ... ఏ గాలులూ నిను తాకినా నా గుండెలో ఆవేదనా వలపే మన సొంతం ప్రతిమలుపూ రసవంతం వలపే మన సొంతం ప్రతిమలుపూ రసవంతం కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా  నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా ********** చిత్రం: కాంచన గంగ (1984) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: సినారె నేపధ్య గానం: బాలు, జానకి

స్వర్ణకమలం (1988) | కె.విశ్వనాథ్ | చిత్ర విశేషాలు

చిత్రం
స్వర్ణకమలం (1988) చిన్నప్పటి నుండీ ఎన్నిసార్లు చూసినా కూడా విసుగురాకుండా మళ్ళీ మళ్ళీ చూస్తూనే వస్తున్న సినిమాల్లో స్వర్ణకమలం ఒకటి. ఇటీవలే ఎన్నోసారో గుర్తులేదు కానీ, మళ్ళీ చూశాను. ముందైతే నవతరంగం లేదు కనుక చూసి మనసులో అనుకునేదాన్ని సినిమా గురించి. ఇప్పుడలా కాదు కదా కె.విశ్వనాథ్ తీసిన సినిమాల్లోకెల్లా నాకు బాగ నచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఇదివరలో శుభలేఖ గురించి అన్నట్లే, విశ్వనాథ్ బెస్ట్ ఫైవ్ ని నేను ఎంపిక చేస్తే అందులో ఇది ఉంటుంది. ఈ సినిమా గురించి రాసేది 2 భాగాలుగా విభజించి రాయడం మంచిదేమో అనిపిస్తోంది. 1. కథ – కథనం – నటన వగైరా 2. సంగీతం – సాహిత్యం. ఇలా విభజించుకోడం నా స్వార్థానికే. నేను అన్నీ కలిపి చాట భారతం లా ఒకేసారి రాసేస్తే మీకు విసుగొచ్చి నా రచనల్ని చదవడం మానేస్తారేమో నన్న భయం అని గమనించగలరు. ప్రస్తుతం కథ గురించి మాట్లాడుకుందాం. నాట్య కళాకారుల కుటుంబం లో పుట్టిన మీనాక్షి కి నాట్యం నేర్చుకున్నా కూడా దాని గురించి అంత అంకిత భావం ఉండదు. వాళ్ళింటి వద్దే ఉన్న చంద్ర శేఖర్ అనే పెయింటర్ కి మీనాక్షి అంటే అభిమానం. వీరిద్దరూ హీరో-హీరోయిన్లు. మీనాక్షి తండ్రి కి ఆమె నాట్య కళాకారిణి కావాలన్న కోరి...

ఆంధ్ర జేమ్స్ బాండ్ | Andhra Jamesbond | Superstar Krishna

చిత్రం
ఆంధ్ర జేమ్స్ బాండ్  సూపర్ స్టార్ కృష్ణ  జేమ్స్ బాండ్ బ్రాండెడ్ చిత్రాలు ~~ 1960వ దశకంలో హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలు ఒక ఊపు ఊపేశాయి.  ఆంగ్లం తెలియకపోయినా జేమ్స్ బాండ్ చిత్రాలు గొప్పగా ఫీలయ్యేవాళ్ళు.  ఇటువంటి తరహా సినిమాలు తెలుగులో రాలేదు.   1966 ఆరంభంలో గుమ్మడి, శోభన్ బాబు, కాంచన లతో ఓ కుటుంబ కథా చిత్రం తీద్దామనుకుంటున్న తరుణంలో..  ఎన్నాళ్ళిలా మూస సాంఘికాలు తీస్తారని, ఏదైనా కొత్త తరహా చిత్రం తీస్తే మన ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి కలుగుతుందని నిర్మాతలు  సుందర్ లాల్ నహతా, డూండీ లకు ఓ దగ్గర బంధువు.  సలహా ఇస్తే నిజమేననిపించి తీయబోయే సినిమాని పక్కకు పెట్టేసి ఓ జేమ్స్ బాండ్ తరహా తీద్దామని, ఎక్కువగా ఆంగ్ల క్రైం నవలలు చదివే అలవాటున్న ఆరుద్రని సంప్రదించారు.   అప్పుడు ఫ్రెంచ్ నవల ఆధారిత ఆంగ్ల చిత్రం  ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ పై ఆరుద్ర దృష్టి పడి ఆ నవలని తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ తయారు చేసారు.  ఐతే హీరో ఎంపిక విషయంలో పెద్ద సమస్యే వచ్చింది.   అప్పటి హీరోలు  ఏయన్నార్, ఎన్టీఆర్, జగ్గయ్య, కాంతారావు ప్రభృత...

విజయవాడ కనకదుర్గమ్మ లీలలు | Kanaka Durgamma Leelalu | Real Incident

చిత్రం
విజయవాడ కనకదుర్గమ్మ లీలలు  నిజం గా జరిగిన సంఘటన విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది.. 1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది.. విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు.. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి.. అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.. అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత...