పోస్ట్‌లు

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)

చిత్రం
మావూళ్లో ఒక పడుచుంది పల్లవి: మావూళ్లో ఒక పడుచుంది  దెయ్య మంటే  భయమన్నది డడాఢడాఢడడడాఢడ మావూలళ్లో ఒక పడుచుంది  దెయ్యమంటే భయమన్నది ఆవూళ్లో ఒక చిన్నోడు  నేనున్నాలే పదమన్నాడూ.. చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ - మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ - చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ బలెబలెబలెబలెబలె.... య్య చరణం 1: కంటిమీద కునుకురాదు  బావా అంది కన్ను మూసుకో నన్ను తలచుకో  పిల్లా అన్నాడు హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల కంటిమీద.. ఓహో.. కునుకురాదు..  ఆహ.. బావా అంది కన్ను మూసుకో నన్ను తలచుకో  పిల్లా అన్నాడు ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అరె - బతకే బతకే బతకే హటకే హటకే హటకే అరె - బతకే బతకే బతకే హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా మా వూళ్లో ఒక పడుచుంది  దెయ్యమంటే భయమన్నది ఆవూళ్లో ఒక చిన్నోడు  నేనున్నాలే పదమన్నాడూ చరణ...

ప్రేలితి వెన్నొ మార్లు | Prelithivennomarlu | Padyam | Ghantasala | Narthanasala (1963)

చిత్రం
ప్రేలితి వెన్నొ మార్లు ప్రేలితి వెన్నొ మార్లు కురు వృద్ధుల ముందర నేనొకండనే జాలుదు అర్జునుంగెలువ సంగర మందని నీదు శస్త్ర విద్యాలవదుర్విదగ్ధత బయల్పడు కాలము దాపు రించె నిన్ కాలుని ప్రోలికంపెద కర్ణా రణాంగణ మందు నిల్వుమా నర్తనశాల చిత్రం లో విరాటపర్వం నందు ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సేనను ఎదుర్కొనడానికి వచ్చిన అర్జునుడు, కర్ణుని చూసి ఎత్తిపొడుపు గా పాడిన పద్యము  ఈ సందర్భములో మిగిలిన పద్యములు తిక్కన గారివే వున్నాయి, కావున ఈ పద్యము కూడా తిక్కన గారిదేమోననే సందేహం కలుగక మానదు . తిక్కన గారికి సమ ఉజ్జిగా అభినవ తిక్కనగారు శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు రాసిన ఈ పద్యము కూడా మంచి గుర్తింపు పొందింది.  ********** చిత్రం : నర్తనశాల (1963) గానం : ఘంటసాల రచన : సముద్రాల రాఘవాచార్య, సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

పెళ్ళంటే నూరేళ్ల పంటా | Pellante noorella panta | Song Lyrics | Meena (1973)

చిత్రం
పెళ్ళంటే  నూరేళ్ల పంటా పల్లవి  పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆ  అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని. అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి కదిలావమ్మా పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ చరణం 1 మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా... చరణం 2 మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ. అలమటించుతారు అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ. అలమటించుతారు పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా... చరణం 3 మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా ...

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు | Evvani Vakita | Padyam Lyrics | Narthanasala (1963)

చిత్రం
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు పద్యము :  ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వాని గుణలతలేడువారాశుల కడపటి కొండపై గలయ బ్రాకు నతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు ఎవ్వాని వాకిట - ఎవరి వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో) ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో) ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో) ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో అతడు - ధర్మ...

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

చిత్రం
  ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ             రా పురవీధుల గ్రాలగలదె       మణిమయంబగు భూషణ జాలములనొప్పి             ఒడ్డోలగంబున నుండగలదె       అతి మనోహరలగు చతురాంగనల తోడి             సంగతి వేడ్కలు సలుపగలదె       కర్పూర చందన కస్తూరి కాదుల             నింపు సొంపార భోగింపగలదె గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర        వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి        సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె        జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి ...

ఆడవే గోపికా ఆటకే దీపికా | Adave Gopika Atake Deepika | Song Lyrics | Anuraga Devatha (1982)

చిత్రం
ఆడవే గోపికా ఆటకే దీపికా  పల్లవి : ఆడవే... లల్లల్లా గోపికా... లల్లలా ఆటకే... దీపికా నేలపై... లల్లలా తారక... లల్లలా నెమలికే... గీటుగా సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే ఆడవే... లల్లల్లా గోపికా... లల్లలా ఆటకే... దీపికా  చరణం 1 : గాలికెగిరే పడతి కొంగై...  నింగి కెగసే కడలి పొంగై కుంకుమంటిన సందెల మబ్బై...  ఆకసాన చుక్కల ముగ్గై రెళ్లు చేల వెన్నుల మీదా...  వెల్లువైన వెన్నెల లాగా  నవ్వులా...పూవులా... గువ్వలా... దివ్యలా... గువ్వలా నువ్వలా ఆడితే... లల్లలా గోపికా... లల్లలా పాటకే... దీపికా పాడరా... లల్లలా హాయిగా... లల్లలా పదములే... ఆడగా తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే  ఆడితే... లల్లలా గోపికా... లల్లలా పాటకే... దీపికా చరణం 2 : నవ్వుంది చాలే నజరానా... కురిసింది నాలో మరుమల్లె వానా మబ్బులలోన జాబిలికున్న  తెల్లారిపోయే నీ నవ్వులోనా నడియేటి మీద నావంటి దానా...  న...

నీ ఆట నా పాట | Nee Aata naa paata | Song Lyrics | Anuraga Devatha (1982)

చిత్రం
నీ ఆట నా పాట పది మంది చూడాలి ఈ పూటా పల్లవి: నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చరణం 1: అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే...ఏ... అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే.... యద మీద హారాలు తారాడుతుంటే తారళ్ళు నీ కంట తానాలు చేస్తుంటే తెలుగు పాటక ఓ ఎంకివై.. తెలుగు తోట విరికంకివై కిన్నెర మీటే నవ్వులతో.. కిన్నెర మీటే నవ్వులతో ... కిన్నెరసాని నడకలతో.. కిన్నెరసాని నడకలతో.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చరణం 2: జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే..అహా.. పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే.... జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే.. పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే నీ కంటి నీడల్లో నే రాగమవుతుంటే... కూచిపూడికి ఒక ఆటావై కూనలమ్మ త...