మామవ పట్టాభి రామ | Maa Mava Pattabhi Rama | Deekshitar Kruthi | Maniranga Ragam
మామవ పట్టాభి రామ పల్లవి : మవ పట్టాభి రామ జయ మారుతి సన్నుత నామ అనుపల్లవి : కోమల తవ పల్లవ పద కోదండరామ ఘనశ్యామల విగ్రహాబ్జనయన సంపూర్ణకామ రఘురామ కళ్యాణరామ రామ చరణం : చత్రచామర ధృత భరత లక్ష్మణ శతృఘ్న విభీషణ సుగ్రీవ ప్రముఖాది సేవిత అత్రి వశిష్టాద్యనుగ్రహ పాత్ర దశరథ పుత్ర మణిరంగవల్యాలంకృత నవరత్న మంటపే విచిత్ర మణిమయ సింహాసనే సీతయాసహ సంస్థిత సుచరిత్ర పరమ పవిత్ర గురుగుహమిత్ర పంకజమిత్ర వంశసుధాంభుధిచంద్ర మేధినీఫాల రామచంద్ర *********** దీక్షితార్ కృతి మణిరంగ రాగం