ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా పురవీధుల గ్రాలగలదె మణిమయంబగు భూషణ జాలములనొప్పి ఒడ్డోలగంబున నుండగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదె గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి ...