పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)

చిత్రం
మావూళ్లో ఒక పడుచుంది పల్లవి: మావూళ్లో ఒక పడుచుంది  దెయ్య మంటే  భయమన్నది డడాఢడాఢడడడాఢడ మావూలళ్లో ఒక పడుచుంది  దెయ్యమంటే భయమన్నది ఆవూళ్లో ఒక చిన్నోడు  నేనున్నాలే పదమన్నాడూ.. చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ - మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ - చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ బలెబలెబలెబలెబలె.... య్య చరణం 1: కంటిమీద కునుకురాదు  బావా అంది కన్ను మూసుకో నన్ను తలచుకో  పిల్లా అన్నాడు హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల కంటిమీద.. ఓహో.. కునుకురాదు..  ఆహ.. బావా అంది కన్ను మూసుకో నన్ను తలచుకో  పిల్లా అన్నాడు ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అరె - బతకే బతకే బతకే హటకే హటకే హటకే అరె - బతకే బతకే బతకే హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా మా వూళ్లో ఒక పడుచుంది  దెయ్యమంటే భయమన్నది ఆవూళ్లో ఒక చిన్నోడు  నేనున్నాలే పదమన్నాడూ చరణం 2: బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే -  ఓహో - బాబోయి అ

ప్రేలితి వెన్నొ మార్లు | Prelithivennomarlu | Padyam | Ghantasala | Narthanasala (1963)

చిత్రం
ప్రేలితి వెన్నొ మార్లు ప్రేలితి వెన్నొ మార్లు కురు వృద్ధుల ముందర నేనొకండనే జాలుదు అర్జునుంగెలువ సంగర మందని నీదు శస్త్ర విద్యాలవదుర్విదగ్ధత బయల్పడు కాలము దాపు రించె నిన్ కాలుని ప్రోలికంపెద కర్ణా రణాంగణ మందు నిల్వుమా నర్తనశాల చిత్రం లో విరాటపర్వం నందు ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సేనను ఎదుర్కొనడానికి వచ్చిన అర్జునుడు, కర్ణుని చూసి ఎత్తిపొడుపు గా పాడిన పద్యము  ఈ సందర్భములో మిగిలిన పద్యములు తిక్కన గారివే వున్నాయి, కావున ఈ పద్యము కూడా తిక్కన గారిదేమోననే సందేహం కలుగక మానదు . తిక్కన గారికి సమ ఉజ్జిగా అభినవ తిక్కనగారు శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు రాసిన ఈ పద్యము కూడా మంచి గుర్తింపు పొందింది.  ********** చిత్రం : నర్తనశాల (1963) గానం : ఘంటసాల రచన : సముద్రాల రాఘవాచార్య, సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

పెళ్ళంటే నూరేళ్ల పంటా | Pellante noorella panta | Song Lyrics | Meena (1973)

చిత్రం
పెళ్ళంటే  నూరేళ్ల పంటా పల్లవి  పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆ  అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని. అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి కదిలావమ్మా పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ చరణం 1 మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా... చరణం 2 మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ. అలమటించుతారు అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ. అలమటించుతారు పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా... చరణం 3 మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా మనసు ఒకరిపైనా.

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు | Evvani Vakita | Padyam Lyrics | Narthanasala (1963)

చిత్రం
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు పద్యము :  ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వాని గుణలతలేడువారాశుల కడపటి కొండపై గలయ బ్రాకు నతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు ఎవ్వాని వాకిట - ఎవరి వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో) ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో) ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో) ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో అతడు - ధర్మరాజు