పెళ్ళంటే నూరేళ్ల పంటా | Pellante noorella panta | Song Lyrics | Meena (1973)

పెళ్ళంటే  నూరేళ్ల పంటా



పల్లవి 

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆ 

అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి

బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.

అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి కదిలావమ్మా

పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ


చరణం 1

మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు

ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు

మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు

ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు


మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు

మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు

అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు


పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట

అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా...


చరణం 2

మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు

ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ

మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు

ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ


అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు

అపనిందలపాలవుతూ. అలమటించుతారు

అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు

అపనిందలపాలవుతూ. అలమటించుతారు


పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట

అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా...


చరణం 3

మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా

మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా

ఎలా కుదురుతుందీ. ఇది ఎలా జరుగుతుందీ.


కలిమి కాదు మగువకు కావలసిందీ...

కలిమి కాదు మగువకు కావలసిందీ...

మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ

మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ.

మనువు కోరుకుందీ.


పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంట

అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి

బంధాలని తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.

అడుగు ముందుకేశావమ్మా. 

అడుగు ముందుకేశావమ్మా

పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ

******************

చిత్రం :  మీనా   (1973)

సంగీతం :  రమేష్ నాయుడు 

గీతరచయిత :  దాశరధి 

నేపధ్య గానం :  బాలు, 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)