పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం | Sri Venkateswara Karavalamba stotram | Sri Nrusimha Bharati

చిత్రం
శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం  శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష | లీలాకటాక్షపరిరక్షితసర్వలోక శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 1 || బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త | కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 2 || వేదాంతవేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ | లోకైకపావన పరాత్పర పాపహారిన్ శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 3 || లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోషపరిహారిత బోధదాయిన్ | దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 4 || తాపత్రయం హర విభో రభసాన్మురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష | మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 5 || శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికాతిలకశోభిలలాటదేశ | రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 6 || వందారులోక వరదాన వచోవిలాస రత్నాఢ్యహారపరిశోభితకంబుకంఠ | కేయూరరత్న సువిభాసి దిగంతరాళ శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 7 || దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్ కేయూరభూషణసుశోభితదీర్ఘబాహో | నాగే

మానస సంచరరే | Manasa Sancharare | Sadashiva Brahmendraswamy keerthana | Sankarabharanam (1980)

చిత్రం
మానస సంచరరే పల్లవి : మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే యే..యే.. అను పల్లవి : మధ శిఖి పింఛా అలంకృత చికురే మహనీయ కపోల విచిత ముఖురే మానస సంచరరే యే..యే.. చరణం : శ్రీరమణి కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే పరమ హంస ముఖ చంద్ర చకోరే పరి పూరిత మురళీ రవధారే మానస సంచరరే యే..యే.. *************** సదాశివ బ్రహ్మేంద్రస్వామి కీర్తన సామరాగం , ఆదితాళం సంగీతం : KV మహదేవన్ గానం : బాలు, వాణి జయరాం  చిత్రం :  శంకరాభరణం (1980)

ఏతీరుగ నను దయజూచెదవో | రామదాసు కీర్తన | Ye teeruga nanu dayachusedavo | Ramadasu Keerthana

చిత్రం
  ఏతీరుగ నను దయజూచెదవో పల్లవి :  ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా  || ఏతీరుగ || చరణం  1:  శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను - కన్నది కానుపు రామా  || ఏతీరుగ || చరణం  2:  మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా  || ఏతీరుగ || చరణం  3:  క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా  || ఏతీరుగ || చరణం  4:  గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా  || ఏతీరుగ || చరణం  5:  నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా  ||ఏతీరుగ || చరణం  6:  వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా  || ఏతీరుగ || చరణం  7:  వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా  || ఏతీరుగ || **************** రామదాసు కీర్తన రచించినవారు రామదాసు రాగం - నాదనామక్రియ తాళం - ఆది

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

చిత్రం
శ్రీ  వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి శ్రీ వెంకటా చలపతీ, నీ చరణాలే సధ్గతి, ఆ ఆ ఆ ఆ శ్రీ వెంకటా చలపతీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి, వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి, నిను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి, శ్రీ వెంకటా చలపతీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి, వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి, నిను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి, శ్రీ వెంకటా చలపతీ సకల కళ సంపన్నములోయీ, నీ కన్నులూ నికిలపాప తిమిరహరములోయీ, నీ చూపులూ సకల కళ సంపన్నములోయీ, నీ కన్నులూ నికిలపాప తిమిరహరములోయీ, నీ చూపులూ ఆ కన్నులు, ఆ చూపులు మా ఆపదలకు కాపులు కరుణామృత, భరితశ్రిత, వరదార్పుట గుణహిత శ్రీ వెంకటా చలపతీ, వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి, నినునిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి, శ్రీ వెంకటా చలపతీ సంతట శుభ సంచిత వరదరములూ, నీ కరములూ. అతులిత మహిమాన్విత శ్రీకరములూ, నీ వరములూ. సంతట శుభ సంచిత వరదరములూ, నీ కరములూ. అతులిత మహిమాన్విత శ్రీకరములూ, నీ వరములూ. ఆ కరములు, నీ వరములు,, ఆనందరసాకరములు హలదాయము, నీ సాయము దయ సేయుము స్వామి. శ్రీ వెంకటా చలపతీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి, నినునిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి, శ్రీ వెంకటా చలపతీ ********

మాణిక్యవీణా ముఫలాలయంతీం | Manikya veena | Slokam Lyrics | Sankarabharanam (1980)

చిత్రం
మాణిక్యవీణా ముఫలాలయంతీం శ్లోకం : మాణిక్యవీణా.. ముఫలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్ మాతంగకన్యామ్ మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే.. కుచోన్నతే కుంకుమరాగశోణే.. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే... జగదేకమాతః ... జగదేకమాతః ************** చిత్రం :  శంకరాభరణం (1980) సంగీతం :  కె.వి. మహదేవన్ శ్లోకం :  శ్యామల దండకం  రచన : మహాకవి కాళిదాసు  నేపథ్య గానం :  బాలు  

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

చిత్రం
దేవి శాంభవి దీన బాంధవి దేవి శాంభవి దీన బాంధవి  పాహి పార్వతి కృపా సరస్వతి  దేవి శాంభవి దీన బాంధవి  పాహి పార్వతి కృపా సరస్వతి  లోక బాంధవి ప్రాణ దాతవి  శోక గాధవి కాపాడు శాంభవి  అశ్రుధారతో నీ కాళ్ళు కడగామా  రక్త గంగతో పారాణి దిద్దమా  దేవుడంటి మా ప్రభువు కోసము  నీవు కోరితే మా ప్రాణమివ్వమా  శ్రీ దుర్గ కనక దుర్గ కొండ దేవతా  కొంగుపట్టి అడిగినాము నీ సాహతా... ************* చిత్రం: కొండవీటి దొంగ (1990)  సంగీతం: ఇళయరాజా  గీతరచయిత: వేటూరి  నేపధ్య గానం: SP  శైలజ & బృందం 

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)

చిత్రం
మావూళ్లో ఒక పడుచుంది పల్లవి: మావూళ్లో ఒక పడుచుంది  దెయ్య మంటే  భయమన్నది డడాఢడాఢడడడాఢడ మావూలళ్లో ఒక పడుచుంది  దెయ్యమంటే భయమన్నది ఆవూళ్లో ఒక చిన్నోడు  నేనున్నాలే పదమన్నాడూ.. చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ - మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ - చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ హోయ్ బలెబలెబలెబలెబలె.... య్య చరణం 1: కంటిమీద కునుకురాదు  బావా అంది కన్ను మూసుకో నన్ను తలచుకో  పిల్లా అన్నాడు హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల కంటిమీద.. ఓహో.. కునుకురాదు..  ఆహ.. బావా అంది కన్ను మూసుకో నన్ను తలచుకో  పిల్లా అన్నాడు ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అరె - బతకే బతకే బతకే హటకే హటకే హటకే అరె - బతకే బతకే బతకే హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా మా వూళ్లో ఒక పడుచుంది  దెయ్యమంటే భయమన్నది ఆవూళ్లో ఒక చిన్నోడు  నేనున్నాలే పదమన్నాడూ చరణం 2: బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే -  ఓహో - బాబోయి అ

ప్రేలితి వెన్నొ మార్లు | Prelithivennomarlu | Padyam | Ghantasala | Narthanasala (1963)

చిత్రం
ప్రేలితి వెన్నొ మార్లు ప్రేలితి వెన్నొ మార్లు కురు వృద్ధుల ముందర నేనొకండనే జాలుదు అర్జునుంగెలువ సంగర మందని నీదు శస్త్ర విద్యాలవదుర్విదగ్ధత బయల్పడు కాలము దాపు రించె నిన్ కాలుని ప్రోలికంపెద కర్ణా రణాంగణ మందు నిల్వుమా నర్తనశాల చిత్రం లో విరాటపర్వం నందు ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సేనను ఎదుర్కొనడానికి వచ్చిన అర్జునుడు, కర్ణుని చూసి ఎత్తిపొడుపు గా పాడిన పద్యము  ఈ సందర్భములో మిగిలిన పద్యములు తిక్కన గారివే వున్నాయి, కావున ఈ పద్యము కూడా తిక్కన గారిదేమోననే సందేహం కలుగక మానదు . తిక్కన గారికి సమ ఉజ్జిగా అభినవ తిక్కనగారు శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు రాసిన ఈ పద్యము కూడా మంచి గుర్తింపు పొందింది.  ********** చిత్రం : నర్తనశాల (1963) గానం : ఘంటసాల రచన : సముద్రాల రాఘవాచార్య, సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

పెళ్ళంటే నూరేళ్ల పంటా | Pellante noorella panta | Song Lyrics | Meena (1973)

చిత్రం
పెళ్ళంటే  నూరేళ్ల పంటా పల్లవి  పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆ  అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని. అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి కదిలావమ్మా పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ చరణం 1 మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా... చరణం 2 మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ. అలమటించుతారు అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు అపనిందలపాలవుతూ. అలమటించుతారు పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా... చరణం 3 మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా మనసు ఒకరిపైనా.

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు | Evvani Vakita | Padyam Lyrics | Narthanasala (1963)

చిత్రం
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు పద్యము :  ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వాని గుణలతలేడువారాశుల కడపటి కొండపై గలయ బ్రాకు నతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు ఎవ్వాని వాకిట - ఎవరి వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో) ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో) ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో) ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో అతడు - ధర్మరాజు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

చిత్రం
  ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ             రా పురవీధుల గ్రాలగలదె       మణిమయంబగు భూషణ జాలములనొప్పి             ఒడ్డోలగంబున నుండగలదె       అతి మనోహరలగు చతురాంగనల తోడి             సంగతి వేడ్కలు సలుపగలదె       కర్పూర చందన కస్తూరి కాదుల             నింపు సొంపార భోగింపగలదె గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర        వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి        సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె        జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) – ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో – ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం. నర్తనశాల సినిమాలో ఘంటసాల

ఆడవే గోపికా ఆటకే దీపికా | Adave Gopika Atake Deepika | Song Lyrics | Anuraga Devatha (1982)

చిత్రం
ఆడవే గోపికా ఆటకే దీపికా  పల్లవి : ఆడవే... లల్లల్లా గోపికా... లల్లలా ఆటకే... దీపికా నేలపై... లల్లలా తారక... లల్లలా నెమలికే... గీటుగా సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే ఆడవే... లల్లల్లా గోపికా... లల్లలా ఆటకే... దీపికా  చరణం 1 : గాలికెగిరే పడతి కొంగై...  నింగి కెగసే కడలి పొంగై కుంకుమంటిన సందెల మబ్బై...  ఆకసాన చుక్కల ముగ్గై రెళ్లు చేల వెన్నుల మీదా...  వెల్లువైన వెన్నెల లాగా  నవ్వులా...పూవులా... గువ్వలా... దివ్యలా... గువ్వలా నువ్వలా ఆడితే... లల్లలా గోపికా... లల్లలా పాటకే... దీపికా పాడరా... లల్లలా హాయిగా... లల్లలా పదములే... ఆడగా తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే  ఆడితే... లల్లలా గోపికా... లల్లలా పాటకే... దీపికా చరణం 2 : నవ్వుంది చాలే నజరానా... కురిసింది నాలో మరుమల్లె వానా మబ్బులలోన జాబిలికున్న  తెల్లారిపోయే నీ నవ్వులోనా నడియేటి మీద నావంటి దానా...  నడుమెక్కడుంది నీ ఒంటిలోనా  నా కంటి ఇంటా దివ్య

నీ ఆట నా పాట | Nee Aata naa paata | Song Lyrics | Anuraga Devatha (1982)

చిత్రం
నీ ఆట నా పాట పది మంది చూడాలి ఈ పూటా పల్లవి: నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చరణం 1: అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే...ఏ... అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే.... యద మీద హారాలు తారాడుతుంటే తారళ్ళు నీ కంట తానాలు చేస్తుంటే తెలుగు పాటక ఓ ఎంకివై.. తెలుగు తోట విరికంకివై కిన్నెర మీటే నవ్వులతో.. కిన్నెర మీటే నవ్వులతో ... కిన్నెరసాని నడకలతో.. కిన్నెరసాని నడకలతో.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చరణం 2: జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే..అహా.. పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే.... జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే.. పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే నీ కంటి నీడల్లో నే రాగమవుతుంటే... కూచిపూడికి ఒక ఆటావై కూనలమ్మ త

కాళ్ళగజ్జ కంకాళమ్మా | Kallagajja Kankalamma | Song Lyrics | Srivari Muchatlu (1981)

చిత్రం
కాళ్ళగజ్జ కంకాళమ్మా పల్లవి : కాళ్ళగజ్జ కంకాళమ్మా.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా? వేగుచుక్కా వెలగ పండు.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా? పెళ్ళీ అంటే.. చుక్క పెట్టుకొచ్చా.. ఆ... ఆ.. రమ్మన్నావంటే.. గజ్జెలేసుకొచ్చా... ఆ.. ఆ.. పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా.. ఆ.. ఆ.. రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా.. ఆ.. ఆ... హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా... హ ... హ కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా... హ... హ చరణం 1 : నిన్ను చూడగానే నాకు వయసు తెలిసింది వయసు తెలియగానే పెళ్ళి గురుతుకొచ్చింది కాళ్ళ మట్టెలు.. రాళ్ళ పోగులు..  ఎర్ర గాజులు.. నల్ల పూసలు.. సిద్ధం చేశాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను పెళ్ళి అనగానే నువ్వు గుర్తుకొచ్చా వు నువ్వు గురుతు రాగానే ఆశ చచ్చిపోయింది కాషాయాలు.. కమండలలౌ..  రుద్రాక్షలు.. పులిచర్మాలు సిద్ధం చేశాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ.. అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా హా హా హా  చరణం 2 : పువ్వు పుట్టగానే గుప్పు గుప్పు మంటుంది న