ఏతీరుగ నను దయజూచెదవో | రామదాసు కీర్తన | Ye teeruga nanu dayachusedavo | Ramadasu Keerthana

 ఏతీరుగ నను దయజూచెదవో




పల్లవి

ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా

నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా 

|| ఏతీరుగ ||


చరణం 1: 

శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా

కారుణ్యాలయ భక్తవరద నిను - కన్నది కానుపు రామా 

|| ఏతీరుగ ||


చరణం 2: 

మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా

మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా 

|| ఏతీరుగ ||


చరణం 3: 

క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా

దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా 

|| ఏతీరుగ ||


చరణం 4: 

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా

గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా 

|| ఏతీరుగ ||


చరణం 5: 

నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా

నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా 

||ఏతీరుగ ||


చరణం 6: 

వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా

భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా 

|| ఏతీరుగ ||


చరణం 7: 

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా

దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా 

|| ఏతీరుగ ||


****************


రామదాసు కీర్తన

రచించినవారు రామదాసు

రాగం - నాదనామక్రియ

తాళం - ఆది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)