చుక్కల తోటలో ఎక్కడున్నావో | Chukkala thotalo Song Lyrics | Allari Bullodu (1978)

చుక్కల తోటలో ఎక్కడున్నావో 




పల్లవి:

చుక్కల తోటలో ఎక్కడున్నావో 
పక్కకు రావే మరుమల్లె పువ్వా 
చక్కని జాబిలి ఎక్కడుంటాను 
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను


చరణం 1:

నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది
మల్లిక నా రాగ మాలిక అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న
నా మమత కొసరింది కోరిక అనురాగ గీతిక 
నీ మూగ చూపులలో...
చెలరేగే పిలుపులలో నీ పట్టు విడుపులలో...

సుడి రేగే వలపులలో కన్ను కన్ను కలవాలి 
కలసి వెన్నెలై పోవాలి 
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

 

చరణం 2:

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో.. 
కౌగిలింతకే తెలుసు
ఆకలెంత తీరనిదో వేచి వున్న నాకు తెలుసు 
విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో
ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు ఆ.........
ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు 
నీలో తీగలు మీటాలి..
నాలో రాగం పలకాలి లోకం మరచిన మైకంలో 
మనమే ఏకం కావాలి


చిత్రం: అల్లరి బుల్లోడు (1978)
సంగీతం: చక్రవర్తి
రచన : వేటూరి, 
నేపధ్య గానం: బాలు, సుశీల

 
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram