ఆంధ్ర జేమ్స్ బాండ్ | Andhra Jamesbond | Superstar Krishna

ఆంధ్ర జేమ్స్ బాండ్ 



సూపర్ స్టార్ కృష్ణ 


జేమ్స్ బాండ్ బ్రాండెడ్ చిత్రాలు ~~ 1960వ దశకంలో హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలు ఒక ఊపు ఊపేశాయి.  ఆంగ్లం తెలియకపోయినా జేమ్స్ బాండ్ చిత్రాలు గొప్పగా ఫీలయ్యేవాళ్ళు.  ఇటువంటి తరహా సినిమాలు తెలుగులో రాలేదు.  


1966 ఆరంభంలో గుమ్మడి, శోభన్ బాబు, కాంచన లతో ఓ కుటుంబ కథా చిత్రం తీద్దామనుకుంటున్న తరుణంలో..  ఎన్నాళ్ళిలా మూస సాంఘికాలు తీస్తారని, ఏదైనా కొత్త తరహా చిత్రం తీస్తే మన ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి కలుగుతుందని నిర్మాతలు  సుందర్ లాల్ నహతా, డూండీ లకు ఓ దగ్గర బంధువు.  సలహా ఇస్తే నిజమేననిపించి తీయబోయే సినిమాని పక్కకు పెట్టేసి ఓ జేమ్స్ బాండ్ తరహా తీద్దామని, ఎక్కువగా ఆంగ్ల క్రైం నవలలు చదివే అలవాటున్న ఆరుద్రని సంప్రదించారు.  


అప్పుడు ఫ్రెంచ్ నవల ఆధారిత ఆంగ్ల చిత్రం  ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ పై ఆరుద్ర దృష్టి పడి ఆ నవలని తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ తయారు చేసారు.  ఐతే హీరో ఎంపిక విషయంలో పెద్ద సమస్యే వచ్చింది.  


అప్పటి హీరోలు  ఏయన్నార్, ఎన్టీఆర్, జగ్గయ్య, కాంతారావు ప్రభృతులు ఎవ్వరూ కూడా జేమ్స్ బాండ్ పాత్రకు మేచ్ కారు.  జేమ్స్ బాండ్ అంటే స్లిమ్ పర్సనాలిటీ, మంచి హైట్, నటనలో వేగం వంటివి ఉండాలి..  చుట్టూ గన్స్ & గర్ల్స్ ఉండాలి..  వయసు 30కి అటూ ఇటూ గా ఉండాలి.  


1965లో విడుదలైన తేనె మనసులు లో క్లైమాక్స్ ఛేజింగ్ సన్నివేశాలలో కృష్ణ నటన నిర్మాత లకు నచ్చడంతో   ఆదుర్తి ని సంప్రదించి జేమ్స్ బాండ్ పాత్రకి తగినవిధంగా చేసి స్క్రీన్ టేస్ట్ చేశారు.  అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ రావడంతో వెంటనే కృష్ణ ని ఓకే చేశారు.  


గూఢచారి 116 అనే టైటిల్ పెట్టి 1966 ఆగస్టు 11న విడుదల చేశారు.  పూర్తిగా కొత్త తరహాలో ఉండటంతో ప్రేక్షకులు  గూఢచారి 116 సినిమాకి అన్ని కేంద్రాల్లో అనూహ్యంగా స్పందించారు.. బ్రహ్మరథం పట్టారు.  


రెండవ చిత్రంతోనే కృష్ణ తో పాటు జయలలిత కూడా స్టార్ డం అందుకున్నారు.  మరి వెనుదిరిగి చూసుకోలేదు.  

స్వరకర్త  టి చలపతిరావు కూడా మరింత శ్రద్ధ తీసుకుని కలకాలం గుర్తుండిపోయేలా ఆరు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు.  గొప్ప మ్యూజికల్ హిట్ గా నిలిచిన గూఢచారి 116 ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసింది తెలుగులో.  


దర్శకుడు ఎమ్ మల్లికార్జున రావు మంచి ఉత్కంఠ భరితంగా ఈ జేమ్స్ బాండ్ చిత్రాన్ని తెరకెక్కించారు.  తెలుగులో జేమ్స్ బాండ్ అనగానే కృష్ణే అనేంత గొప్ప ఇమేజ్ తెచ్చిపెట్టింది ఈ  గూఢచారి 116 చిత్రం.  


తరువాత  లవ్ ఇన్ ఆంధ్రా, అందరికీ మొనగాడు, మాస్టర్ కిలాడి,  జేమ్స్ బాండ్ 777,  ఏజెంట్ గోపి,  రహస్య గూఢచారి, గూఢచారి 117 చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ జేమ్స్ బాండ్ గా ప్రేక్షకులను మెప్పించారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram