సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు | తొలి తెలుగు కౌబోయ్ మూవీ | Mosagallaku Mosagadu (1971)

సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’




తొలి తెలుగు కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు.. 


మోసగాళ్ళకు మోసగాడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించగా, కృష్ణ, విజయనిర్మలనాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించిన తెలుగు యాక్షన్ కౌబాయ్ చిత్రం. భారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరుతెచ్చుకుంది.

పద్మాలయా స్టూడియోస్ కృష్ణ పెద్దకుమార్తె పద్మా పేరుమీదుగా, సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడిన కృష్ణ స్వంత బ్యానర్. 1970లో తానే కథానాయకునిగా ఆ పతాకంపై తొలి సినిమా అగ్నిపరీక్ష పరాజయం పాలైంది. ఆ సమయంలో మద్రాసు థియేటర్లలో విజయవంతమవుతున్న మెకన్నాస్ గోల్డ్ వంటి కౌబాయ్ చిత్రాలపై కృష్ణ దృష్టిపడింది. మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన దాంతో కృష్ణకు వచ్చింది.  కృష్ణ ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ రచయిత ఆరుద్ర రాశారు. సినిమాకి కథ, చిత్రానువాదం, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పూర్తిచేసి నిర్మాతలకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని భావించిన నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావు ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు. అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దాంతో ఇక వేరే దారిలేక అప్పటికే విజయలలితతో రౌడీరాణి అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన కె.ఎస్.ఆర్.దాస్‌ని దర్శకునిగా తీసుకున్నారు.  సినిమాకి మొదట "అదృష్టరేఖ" అన్న పేరు పెడదామని భావించారు, కానీ చివరకు "మోసగాళ్ళకు మోసగాడు" అన్న పేరు పెట్టారు.
 
చిత్రీకరణ:
మోసగాళ్ళకు మోసగాడు సినిమాను రాజస్థాన్లో ఎడారులు, బికనీర్ కోట, పంజాబ్ లోని సట్లెజ్ నది తీరం, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాకిస్తాన్-చైనా సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వి.ఎస్.ఆర్.స్వామి వ్యవహరించారు.

 
మోసగాళ్ళకు మోసగాడు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో వచ్చింది. కౌబాయ్ అంటే ఉత్తర అమెరికాలో పశువుల మందలను మేపుతూ, వాటికి కాపలాగా ఉంటూ గుర్రాలపై సంచరించే వ్యక్తి. 19వ శతాబ్ది ఉత్తర మెక్సికోలో ఈ పాత్ర జానపద నాయకుని పాత్రగా రూపాంతరం చెంది పలు సాహసగాథలకు ముఖ్యమైన దినుసు అయింది. 19, 20వ శతాబ్దాల్లో అమెరికాలో ఈ కౌబాయ్ పాత్రలను, స్థానిక అమెరికన్ల పాత్రలను రొమాంటిసైజ్ చేస్తూ వెల్డ్ వెస్ట్ షోలు ప్రాచుర్యం పొందాయి.[4] 1920ల నుంచి నేటివరకూ ఆంగ్లంలో పలు కౌబాయ్ సినిమాలో వచ్చాయి. వీటిలో కౌబాయ్ లు నెగిటివ్ గానూ, పాజిటివ్ గానూ కూడా కనిపిస్తారు. కొన్ని సినిమాల్లో కౌబాయ్ లు గ్యాంగ్ స్టర్లుగానూ, మరికొన్నిటిలో దేశభక్తి, సాహసం, ధైర్యం వంటి గుణాలతో కౌబాయ్ కోడ్ వంటి సద్లక్షణాలతోనూ కనిపిస్తారు. మొత్తానికి ఆంగ్ల చిత్రాల్లో కౌబాయ్ ఓ ప్రత్యేకమైన జానర్ గా రూపుదిద్దుకుంది.
ఇలాంటి పూర్తిగా అమెరికన్ సంస్కృతికి చెందిన కౌబాయ్ నేపథ్యంలో సినిమాను రూపొందించి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు రచయిత ఆరుద్ర చాలా కృషి చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. నేపథ్యం కౌబాయ్. ఇలాంటివి సమకాలీన సమాజంలో కానీ, సమీప గతంలో కానీ లేవు కనుక ఈ సినిమా కాలాన్ని బ్రిటీష్ వారూ, ఫ్రెంచ్ వారూ దేశంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజుల్లో సెట్ చేశారు. బొబ్బిలి యుద్ధం కాలంలో బ్రిటీష్ వారు అమరవీడు అనే సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడిచేసిన రోజుల్లో కథ ప్రారంభమవుతుంది. ఆ అమరవీడు సంస్థానపు నిధి కోసం జరిగే అన్వేషణ గద్వాల సంస్థానం, కర్నూలు రాజ్యాల వరకూ సాగుతుంది. ప్రతినాయకులకు బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య అంటూ పేర్లను తెలుగు పట్టణాల పేర్లు కలసివచ్చేలా పెట్టారు. విదేశీ సంస్కృతిలోని నేపథ్యానికి తెలుగు వాతావరణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఇవి.
సినిమాలో నాగభూషణం పోషించిన పాత్ర ప్రముఖ ఆంగ్ల కౌబాయ్ చిత్రం గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలోని అగ్లీ పాత్రను ఆధారం చేసుకుని తయారుచేశారు.
నటీనటులు:
·        కృష్ణ

·        నాగభూషణం

·        సత్యనారాయణ

·        ప్రభాకరరెడ్డి

·        విజయనిర్మల

·        జ్యోతిలక్ష్మి

·        త్యాగరాజు

·        ధూళిపాళ

 
పాటలు:
1.   ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి

2.   కత్తిలాంటి పిల్లోయి కదలివచ్చె కాస్కో మచ్చుకైన మామ - సుశీల

3.   కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే - సుశీల, ఎస్.పి. బాలు

4.   గురిని సూటిగ కొట్టేవాడా సాటిలేనిది - ఎల్. ఆర్. ఈశ్వరి

5.   తకిట ధిమి తక తై తమాషా మైకం తలచినది - ఎల్. ఆర్. ఈశ్వరి

6.   పద్మాలయాం పద్మాకరాం పద్మపత్రనిభేక్షణా (శ్లోకం) - ఎస్.పి. బాలు

 
 
సూపర్ స్టార్ కృష్ణ అండ్ విజయ నిర్మల జోడిగా నటిస్తే ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరు కలిసి జోడిగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని 50 వ ఏట అడుగుపెట్టింది.ఈ చిత్రాన్ని  పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇంకో విశిష్టత కూడా ఉంది. అది ఏంటంటే ఈ సినిమా  తొలి భారతీయ కౌబాయ్ చిత్రం అవ్వడం.  అలాగే ఈ చిత్రం సాధించిన రికార్డులు కూడా అన్ని ఇన్ని కావు.అలాగే ఈ చిత్రంలో కనిపించే  ఏడారులు, గుర్రపు ఛేజింగ్‌లు భలే ఉంటాయి. అలాగే  నిధికోసం ఎత్తుకు పై ఎత్తులు వేయడం సినిమా మొత్తం ఎంతో ఉత్కంఠను రేపుతోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్ అన్ని కలిపి  తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారుపేరు.


 తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి సినిమాఅంటే  ఎలా ఉంటుందో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా ద్వారా  రుచి చూపించారు. ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు అందరు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పట్లో  ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రూ. 6 లక్షల 30 వేలతో నిర్మించారు.  కేవలం తమిళ డబ్బింగ్ వెర్షన్‌లోనే దాదాపు రూ. 7లక్షలు కలెక్ట్ చేసి తమిళంలో కూడా ఓ చరిత్ర సృష్టించింది.తెలుగులో ఓ చరత్రి సృష్టించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం హిందీలో ‘ఖజానా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఇంగ్లీష్‌లో ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో డబ్ చేసారు.


అంతేకాదు అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రికార్డు క్రియేట్ చేసింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. దక్షిణ భారత దేశం నుంచి ఈ సినిమా మాత్రమే ఎంపిక చేయబడడం విశేషం.మోసగాళ్లకు మోసగాడు’ తరహాలో తెలుగులో ఆ తర్వాత ‘మంచివాళ్లకు మంచివాడు’ ’నిజం నిరూపిస్తా’ ‘మెరుపుదాడి’, కొదమ సింహం’, కౌబాయ్ నెం. 1’, ‘టక్కరి దొంగ’ వంటి పలు కౌబాయ్ చిత్రాలు తెరకెక్కాయి.కృష్ణ కి మాత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.. !!

 

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్రకథానాయకులు తెలుగు చిత్రసీమలో రాజ్యమేలుతున్న సమయం అది. నటనమీద ఆసక్తితో సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..  సహాయ పాత్రలు చేస్తూ వచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ. అటు పౌరాణిక, చారిత్రక సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వారి స్థానాన్ని ఎలాగైనా చేరుకోవాలని తాపత్రాయపడ్డాడు. అటు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే మరోవైపు సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పాలని భావించాడు కృష్ణ. ఇందుకు తన తమ్ముళ్లు జి. హనుమంతరావు, జి. ఆదిశేషగిరిరావు సైతం సహాయం చేశారు. అలా ఈ ముగ్గురి అన్నదమ్ములు కలిసి పద్మాలయా పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. పద్మాలయా పిక్చర్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్షను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా మిగిల్చిన నిరాశతో ఏమాత్రం కుంగిపోకుండా.. మరో ప్రయాత్నానికి నాంది పలికారు కృష్ణ సోదరులు. అదే కౌబోయ్ చిత్రం. హాలీవుడ్ కౌబోయ్ చిత్రాల కలయికతో తెలుగులో మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా 1971 ఆగస్ట్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన మోసగాళ్లకు మోసగాడు విడుదలైన నేటికి 50 ఏళ్లు పూర్తి. తెలుగులో మొదటిసారిగా వచ్చిన తొలి కౌబోయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి తెలుగు కౌబోయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాలో గుమ్మడి, నాగభూషణం, సత్యనారాయణ, ముక్కామల, ధూళిపాల, జ్యోతిలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు వంటివారు కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్‏లో సూపర్ హిట్ సాధించిన మెకనాస్ గోల్డ్, ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ ఏ ఫ్యూ డాలర్స్ మోర్ వంటి చిత్రాల కలగలుపుగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను నిర్మించించింది పద్మాలయ పిక్చర్స్ సంస్థ. ఈ సినిమాకు రచనతోపాటు పాటలను కూడా ఆరుద్ర రాశారు.

బొబ్బిలి యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ వారికి దక్కకుండా జమీందారులు తమ సంపదను ఓ చోట దాస్తారు. ఆ గుట్టు తెలిసిన కొత్వాల్‏ను బంధించి ఆ నిధి రహస్యం చెప్పమని అడగ్గా.. అతను నిరాకరించడంతో అతడిని చంపేస్తారు. అయితే ధర్మం కోసం కొత్వాల్ కొడుకు కృష్ణ ప్రసాద్ ఈ విషయం తెలుకుని తన తండ్రిని చంపిన వారికి చంపడానికి బయలుదేరతాడు. రాధ అనే అమ్మాయితోపాటు.. నక్కజిత్తుల నాగన్న అనే దొంగతో కలిసి తనవారిని చంపిన వారిని చంపడానికి బయలుదేరతాడు కృష్ణ ప్రసాద్. అలా వెళ్లిన కృష్ణ.. అనుకున్నట్టుగానే అందరిని చంపేసి నిధిని సాధిస్తాడు. ఆ తర్వాత నాగన్నను ఓ చెట్టుకు వేలాడిదీయాగా.. కృష్ణ ప్రసాద్ అతడిని కాపాడతాడు.

సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించాయి. కృష్ణ ప్రసాద్ ప్రయాణం.. తన కన్నవారిని చంపినవారి గురించి తెలుసుకోవడం.. వారిని మట్టుబెట్టడం ఇలా అన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. అందుకే తెలుగు తొలి కౌబోయ్ సూపర్ హిట్ అయ్యింది. హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. అందుకే ఆయన కౌబోయ్‏గా గుర్తింపు సాధించారు. ఈ మూవీతో చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ స్టార్‏డమ్ అందుకున్నారు. కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోయింది. అంతేకాదు.. ఈ సినిమా అన్ని భాషల్లోకి డబ్ అయి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా… అప్పట్లోనే 125 దేశాలలో రిలీజైన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు ఆది నారాయణ రావు సంగీతం అందించగా.. వియస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించారు.

**************



కామెంట్‌లు

Malleswari చెప్పారు…
Excellent information

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)