తెలుగు జాతి మనది | Telugu Jaati Manadi | Song Lyrics | Talla Pellama (1970)

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది



పల్లవి:


తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది … రాయలసీమ నాది … 

సర్కారు నాది … నెల్లూరు నాది ..

అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా

యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా

వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..

వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా …

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


చరణం 1:


మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో

భాగవతం వెలసింది ఏకశిలానగరంలో

ఈ రెంటిలోన ఏది కాదన్న

ఈ రెంటిలోన ఏది కాదన్న 

ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా

తెలుగు జాతి మనది …. 

నిండుగ వెలుగు జాతి మనది


చరణం 2:


పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది

మూడు కొండలు కలిపి దున్నినా 

ముక్కారు పంటలు బండ్లకెత్తినా

అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము

స్వతంత్ర భారత్ కి జై

గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము

వందేమాతరం .. వందేమాతరం

స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము

జై విశాలాంధ్ర

దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


చరణం 3:


ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా

కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా

పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు

పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు

నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు


***********


చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970)

సంగీతం: టి.వి. రాజు

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram