హృదయమా ఓ బేల హృదయమా | Hrudayama O Bela Hrudayama | Song Lyrics | Bava Maradallu (1960)

హృదయమా... ఓ బేల హృదయమా..



పల్లవి:

హృదయమా... ఓ బేల హృదయమా..

ఒకేసారిగ నీకింత సంతోషమా... 

హృదయమా.. ఆ.. ఆ..



చరణం 1:

తీయని ఊహాలు హాయిగ నీలో 

మరల చిగిర్చె సుమా ...

మరల చిగిర్చె సుమా ..

పూచిన పూవులు నోచిన నోములు

కాచి ఫలించు సుమా.. 

అవి కాచి ఫలించు సుమా


హృదయమా... ఓ బేల హృదయమా...

మనసు తెలుపుగా నీకింత మొమోటమా

హృదయమా...



చరణం 2:

తీగెలు సడలిన సితార తాను 

తిరిగి మ్రోగె సుమా... 

తిరిగి మ్రోగె సుమా ..

మ్రోగిన పాటే మోహానమై 

అనురాగము నించె సుమా... 

అనురాగము నించె సుమా ...


హృదయమా... ఓ బేల హృదయమా..

ఒకేసారిగ నీకింత సంతోషమా..

హృదయమా...



చరణం 3:

అందారాని ఆ చందమామ నీ 

చెతికి అందె సుమా.. 

చెతికి అందె సుమా..

చందమామ నీ చేతులలోనే 

బందీ అగును సుమా... 

ఇక బంది అగును సుమా...


హృదయమా... ఓ బేల హృదయమా...

మనసు తెలుపుగా నీకింత మొమోటమా

హృదయమా... ఆ.. ఆ


చిత్రం:బావమరదళ్ళు (1960)

సంగీతం:పెండ్యాల

గీతరచయిత:ఆరుద్ర

నేపధ్య గానం:ఘంటసాల, సుశీల


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)