సిన్ని సిన్ని కోరికలడగ | Sinni sinni korikaladaga | Song Lyrics | Swayamkrishi (1987)

సిన్ని సిన్ని కోరికలడగ





పల్లవి :


సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ 

ఆ ఆ ఆ

అన్నులమిన్న అలమేలుమంగై 

ఆతని సన్నిధి కొలువుంటా

సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ

అన్నులమిన్న అలమేలుమంగై 

ఆతని సన్నిధి కొలువుంటా



చరణం 1 :



ఎరిగిన మనసుకు ఎరలేలే.. 

ఏలిక శెలవికా శరణేలే

ఎరిగిన మనసుకు ఎరలేలే.. 

ఏలిక శెలవికా శరణేలే



ఎవరికి తెలియని కథలివిలే...

ఎవరికి తెలియని కథలివిలే... 

ఎవరో చెప్పగా ఇక ఏలే 

 

సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ

అన్నులమిన్న అలమేలుమంగై 

ఆతని సన్నిధి కొలువుంటా



చరణం 2 :



నెలత తలపులే నలుగులుగా.. 

కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ

నెలత తలపులే నలుగులుగా.. 

కలికి కనులతో జలకాలు



సందిటనేసిన చెలువములే..

సందిటనేసిన చెలువములే... 

సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ ఆ 

 

సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ

అన్నులమిన్న అలమేలుమంగై 

ఆతని సన్నిధి కొలువుంటా



చరణం 3 :



కళల ఒరుపులే కస్తురిగా.. 

వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ

వలపు వందనపు తిలకాలు



అంకము జేరిన పొంకాలే..

అంకము జేరిన పొంకాలే... 

శ్రీవెంకటపతికికా వేడుకలు.. 

ఉహు.. ఉహూ...  ఉ 

 

సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ 

ఆ ఆ ఆ

అన్నులమిన్న అలమేలుమంగై 

ఆతని సన్నిధి కొలువుంటా

సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ

అన్నులమిన్న అలమేలుమంగై 

ఆతని సన్నిధి కొలువుంటా

******

చిత్రం :  స్వయంకృషి (1987)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సిరివెన్నెల

నేపధ్య గానం :  జానకి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

గలగల పారుతున్న గోదారిలా | Gala Gala Paruthunna Godarila | Song Lyrics | Gowri (1974)

చుక్కల తోటలో ఎక్కడున్నావో | Chukkala thotalo Song Lyrics | Allari Bullodu (1978)