కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి | Kokilamma Pelliki | Song Lyrics | Adavi Ramudu (1977)

 కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి




పల్లవి:


కుకు కుకు కుకు కుకు...

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి...

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి..ఎ..ఎ..ఎ..ఎ..ఈ..


డుడుం డుడుం డుడుం డుడుం...

వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి

పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి...


చరణం 1:


తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన

పిల్లదాని కొచ్చిందీ కళ... పెళ్లికళా..

తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన

పెళ్లికొడుకు నవ్వితే తళా... తళ తళా


పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా

చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా

పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా

చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా


అందమైన పెళ్లికి అందరు పేరంటాలే

అడవిలోని వాగులన్ని ఆనందపు కెరటాలై


కుకు కుకు కుకు కుకు...

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి...

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి


చరణం 2:


కన్ను కన్ను కలుపుకున్న కన్నెమనసు

తెలుసుకున్న కనుల నీలినీడలే కదా ప్రేమకథ..

బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించు

మొగ్గవలపు విచ్చితే కదా ..పెళ్లికథ


ఇరు మనసుల కొకతనువై ఇరుతనవులకొక మనువై

మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై

ఇరు మనసుల కొకతనువై ఇరుతనవులకొక మనువై

మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై


కలిసివున్న నూరేళ్లు కలలుగన్న వేయ్యేళ్లు

మూడుముళ్లు పడిననాడు ఎదలు పూలపొదరిళ్లు


కుకు కుకు కుకు కుకు...

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి...

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి

డుడుం డుడుం డుడుం డుడుం...

వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి

పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి


************


చిత్రం: అడవి రాముడు (1977)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram