పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

కోటప్పకొండకు వస్తానని | Kotappakondaku Vastanani | Song Lyrics | Premabhishekam (1981)

చిత్రం
కోటప్పకొండకు వస్తానని పల్లవి : కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా  కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా   ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే...  కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా   ఆరుబయట ఎండలో...  సరుగుతోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ...  అహహా.. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా   చరణం 1 : హలో...  హలో...    హలో...  హలో... హలో...  హలో... హలో హలో అనమంటుంది కుర్రమనసు చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు పొమ్మని పైపైకి అంటుంది...  రమ్మని లోలోన ఉంటుంది పొమ్మని పైపైకి అంటుంది...  రమ్మని లోలోన ఉంటుంది పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే... ఔనంటే నువ్వు ఊ... అంటే...  నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ...  అహహా.. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా   చరణం 2 : గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం పెదవి పెదవి కలిపి పాడిత

తెలుగు జాతి మనది | Telugu Jaati Manadi | Song Lyrics | Talla Pellama (1970)

చిత్రం
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది పల్లవి: తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది … రాయలసీమ నాది …  సర్కారు నాది … నెల్లూరు నాది .. అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా.. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ ….. వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా … తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది చరణం 1: మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలానగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ రెంటిలోన ఏది కాదన్న  ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా తెలుగు జాతి మనది ….  నిండుగ వెలుగు జాతి మనది చరణం 2: పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది మూడు కొండలు కలిపి దున్నినా  ముక్కారు పంటలు బండ్లకెత్తినా అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్ కి జై గాంధీ,

నీలి మేఘమా జాలి చూపుమా | Neeli Meghama Jali Chupuma | Song Lyrics | Ammayila Sapatham (1975)

చిత్రం
నీలి మేఘమా జాలి చూపుమా పల్లవి :  నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముషమాగుమా  నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా  కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా  నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా  చరణం 1 :  ఆనుకోని రాగాలు వినిపించెనే  కనరాని స్వర్గాలు దిగివచ్చెనే  ఆనుకోని రాగాలు వినిపించెనే  కనరాని స్వర్గాలు దిగివచ్చెనే  కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా  రా.. జాబిలి నా నెచ్చెలి.. జాగేల... ఈ వేళ.. నను చేరగా  నీలి మేఘమా జాలి చూపుమా.. ఒక నిముషమాగుమా  నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ  చరణం 2 :  కళ్యాణ మేళాలు మ్రోగించనా  కంఠాన సూత్రాన్ని ముడివేయనా  కళ్యాణ మేళాలు మ్రోగించనా..  కంఠాన సూత్రాన్ని ముడివేయనా..  గుండె గుడిగా చేయనా.. నిన్ను కొలువు తీర్చనా  నీ దాసినై... సావాసినై... నా ప్రేమ పుష్పాల పూజించనా...  కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా  నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా.... ************* చిత్రం: అమ్మాయిల శపథం (1975)  సంగీతం: విజయ్ భాస్కర్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపథ్య గానం: బాలు, వాణీ జయరాం 

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి | Devude Ichadu Veedhi okati | Song Lyrics | Antuleni Katha (1976)

చిత్రం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పల్లవి:  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం  చరణం 1:  నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి  చరణం 2:  శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి  చరణం 3:  తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దే

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి | Kokilamma Pelliki | Song Lyrics | Adavi Ramudu (1977)

చిత్రం
  కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి పల్లవి: కుకు కుకు కుకు కుకు... కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి... చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి..ఎ..ఎ..ఎ..ఎ..ఈ.. డుడుం డుడుం డుడుం డుడుం... వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి... చరణం 1: తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన పిల్లదాని కొచ్చిందీ కళ... పెళ్లికళా.. తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన పెళ్లికొడుకు నవ్వితే తళా... తళ తళా పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా అందమైన పెళ్లికి అందరు పేరంటాలే అడవిలోని వాగులన్ని ఆనందపు కెరటాలై కుకు కుకు కుకు కుకు... కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి... చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి చరణం 2: కన్ను కన్ను కలుపుకున్న కన్నెమనసు తెలుసుకున్న కనుల నీలినీడలే కదా ప్రేమకథ.. బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించు మొగ్గవలపు విచ్చితే కదా ..పెళ్లికథ ఇరు మనసుల కొకతనువై ఇరుతనవులకొక మనువై మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై ఇరు మనసుల కొకతనువై ఇరుతనవులకొక మనువై మనసులోని వలపులన్ని మల్లె

అవే కళ్ళు చిత్ర సమీక్ష | Avekallu (1967) Movie Review | Superstar Krishna

చిత్రం
  ‘ అవే కళ్లు ’ (1967) Suspence movie బ్లాక్ అండ్ వైట్‌లో క్రైమ్ పిక్చర్స్ చాలా వచ్చాయి కానీ కలర్‌లో రూపుదిద్దుకొన్న తొలి తెలుగు క్రైమ్ చిత్రం ‘ అవే కళ్లు ’. తెలుగులో హీరో కృష్ణతో , తమిళంలో ‘ అదే కనగళ్ ’ పేరుతో రవిచంద్రన్ హీరోగా రెండు భాషల్లో ఏకకాలంలో నిర్మించింది ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ . ఈ   చిత్ర నిర్మాణ బాధ్యతలు ఏ . వి . మెయ్యప్పన్ స్వయంగా పర్యవేక్షించేవారు . నటీనటులు : కృష్ణ , కాంచన , గుమ్మడి , రాజనాల , పద్మనాభం , రామదాసు , రమణారెడ్డి , నాగభూషణం , రామచంద్రరావు , ఆనందమోహన్ , గీతాంజలి , పుష్పకుమారి , నిర్మల , కనకం , విజయశ్రీ , సాధన , లక్ష్మి . సాంకేతిక నిపుణులు : మాటలు : డి . వి . నరసరాజు , పాటలు : దాశరథి , కొసరాజు ; సంగీతం : వేదా , ఫొటోగ్రఫీ : ఎస్ . మారుతీరావు , కళ : ఎ . కె . శేఖర్ , కూర్పు : ఆర్ . జి . గల్ , సహ నిర్మాతలు : ఎం . మురుగన్ , ఎం . శరవణన్ , ఎం . కుమరన్ ; నిర్మాత : ఎ . వి . మెయ్యప్పన్ , కథ - దర్శకత్వం : ఎ . సి . త్రిలోకచందర్ . కృష్ణకు ఇది రెండో రంగుల చిత్రం . ఏవిఎం సంస్థలో తొలి సినిమా . ఆ రోజుల్లో ఆర్టిస్టులు కాలేజీక

సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు | తొలి తెలుగు కౌబోయ్ మూవీ | Mosagallaku Mosagadu (1971)

చిత్రం
సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ తొలి తెలుగు కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు..  మోసగాళ్ళకు మోసగాడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించగా, కృష్ణ, విజయనిర్మలనాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించిన తెలుగు యాక్షన్ కౌబాయ్ చిత్రం. భారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరుతెచ్చుకుంది. పద్మాలయా స్టూడియోస్ కృష్ణ పెద్దకుమార్తె పద్మా పేరుమీదుగా, సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడిన కృష్ణ స్వంత బ్యానర్. 1970లో తానే కథానాయకునిగా ఆ పతాకంపై తొలి సినిమా అగ్నిపరీక్ష పరాజయం పాలైంది. ఆ సమయంలో మద్రాసు థియేటర్లలో విజయవంతమవుతున్న మెకన్నాస్ గోల్డ్ వంటి కౌబాయ్ చిత్రాలపై కృష్ణ దృష్టిపడింది. మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన దాంతో కృష్ణకు వచ్చింది.  కృష్ణ ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ రచయిత ఆరుద్ర రాశారు. సినిమాకి కథ, చిత్రానువాదం, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్