ప్రేలితి వెన్నొ మార్లు | Prelithivennomarlu | Padyam | Ghantasala | Narthanasala (1963)

ప్రేలితి వెన్నొ మార్లు



ప్రేలితి వెన్నొ మార్లు
కురు వృద్ధుల ముందర
నేనొకండనే జాలుదు
అర్జునుంగెలువ సంగర మందని
నీదు శస్త్ర విద్యాలవదుర్విదగ్ధత
బయల్పడు కాలము దాపు రించె
నిన్ కాలుని ప్రోలికంపెద కర్ణా
రణాంగణ మందు నిల్వుమా

నర్తనశాల చిత్రం లో విరాటపర్వం నందు ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సేనను ఎదుర్కొనడానికి వచ్చిన అర్జునుడు, కర్ణుని చూసి ఎత్తిపొడుపు గా పాడిన పద్యము 

ఈ సందర్భములో మిగిలిన పద్యములు తిక్కన గారివే వున్నాయి, కావున ఈ పద్యము కూడా తిక్కన గారిదేమోననే సందేహం కలుగక మానదు .

తిక్కన గారికి సమ ఉజ్జిగా అభినవ తిక్కనగారు శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు రాసిన ఈ పద్యము కూడా మంచి గుర్తింపు పొందింది. 

**********


చిత్రం : నర్తనశాల (1963)
గానం : ఘంటసాల
రచన : సముద్రాల రాఘవాచార్య,
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics