ఆడవే గోపికా ఆటకే దీపికా | Adave Gopika Atake Deepika | Song Lyrics | Anuraga Devatha (1982)

ఆడవే గోపికా ఆటకే దీపికా 




పల్లవి :


ఆడవే... లల్లల్లా

గోపికా... లల్లలా

ఆటకే... దీపికా

నేలపై... లల్లలా

తారక... లల్లలా

నెమలికే... గీటుగా


సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే

వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే

సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే

వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే


ఆడవే... లల్లల్లా

గోపికా... లల్లలా

ఆటకే... దీపికా 



చరణం 1 :



గాలికెగిరే పడతి కొంగై... 

నింగి కెగసే కడలి పొంగై

కుంకుమంటిన సందెల మబ్బై... 

ఆకసాన చుక్కల ముగ్గై


రెళ్లు చేల వెన్నుల మీదా... 

వెల్లువైన వెన్నెల లాగా 

నవ్వులా...పూవులా... గువ్వలా...

దివ్యలా... గువ్వలా నువ్వలా


ఆడితే... లల్లలా

గోపికా... లల్లలా

పాటకే... దీపికా


పాడరా... లల్లలా

హాయిగా... లల్లలా

పదములే... ఆడగా


తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే

దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే

తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే

దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే 


ఆడితే... లల్లలా

గోపికా... లల్లలా

పాటకే... దీపికా



చరణం 2 :


నవ్వుంది చాలే నజరానా...

కురిసింది నాలో మరుమల్లె వానా

మబ్బులలోన జాబిలికున్న 

తెల్లారిపోయే నీ నవ్వులోనా

నడియేటి మీద నావంటి దానా... 

నడుమెక్కడుంది నీ ఒంటిలోనా 


నా కంటి ఇంటా దివ్యంటివాడా... 

నీ చూపు కలిగే చుక్కల్లో కలిసే


హాయ్..మల్లెల మబ్బుల జల్లుగ రావాలా

ఆ నింగికి దక్కని చుక్కవు కావాలా


ఆకాశవీధుల్లోన...  రాయంచల్లే రావే

నీలాల మబ్బుల్లోన... తేలి తేలి పోవే

ఆకాశవీధుల్లోన...  రాయంచల్లే రావే

నీలాల మబ్బుల్లోన... తేలి తేలి పోవే



ఆడితే... లల్లలా

గోపికా... లల్లలా

పాటకే... దీపికా



ఆడవే... లల్లల్లా

గోపికా... లల్లలా

ఆటకే... దీపికా



చరణం 3 :


తారలడిగే తళుకు నీవై... 

మెరుపుమెరిసే విరుపునీదై

వెన్నెలంటిన వేగులచుక్కై... 

వెల్లవేసిన వేకువ దిక్కై


మంచుపూల పల్లకిమీద...

మెంటిరంగు ఎండల లాగా..




నవ్వులా... లలలా

పూవులా... లలలా

మువ్వలా... లలలా

గువ్వలా... లలలా

నువ్వలా... లలల్లా

దివ్యలా... లలలా




ఆడితే... లల్లలా

గోపికా... లల్లలా

పాటకే... దీపికా



ఆ ఆ ఆ ఆ

ఆడవే... లల్లల్లా

గోపికా... లల్లలా

ఆటకే... దీపికా


లాలలా

లలలా

లాలలా

లలలా

లాలలా..లాలలా

***********


చిత్రం : అనురాగ దేవత (1982)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics