తారలు దిగి వచ్చిన వేళ | Taralu Digivachina Vela | Song Lyrics | Premabhishekam (1981)

తారలు దిగి వచ్చిన వేళ




పల్లవి:


తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ

చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ

తారలు దిగి వచ్చిన వేళా...


చరణం 1:


ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా

పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా

కనిపించే రంగులన్ని సింధూరపు చీరెలా

కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా

కనిపించే రంగులన్ని సింధూరపు చీరెలా

కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా

నిలిచిపొమ్మని మబ్బుగా

కురిసిపోమ్మని వానగా

విరిసిపొమ్మని వెన్నెలగా

మిగిలిపొమ్మని నా గుండెగా


చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ

తారలు దిగి వచ్చిన వేళా...


చరణం 2:


నీలిరంగు చీకటిలో నీలాల తారగా

చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా

వేటాడే చూపులన్ని లోలోన ప్రేమగా

వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్ళిగా

వేటాడే చూపులన్ని లోలోన ప్రేమగా

వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్ళిగా

చెప్పి పొమ్మని మాటగా

చేసి పొమ్మని బాసగా

చూపి పొమ్మని బాటగా

ఇచ్చి పొమ్మని ముద్దుగా


చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ

తారలు దిగి వచ్చిన వేళా...


************


చిత్రం : ప్రేమాభిషేకం (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం : బాలు




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram