మావ కూతురా నీతో మాటున్నదీ | Mama kutura | Song Lyrics | Mana oori katha (1976)

మావ కూతురా నీతో మాటున్నదీ





పల్లవి:

మావ కూతురా నీతో మాటున్నదీ

పడుచు గుండె నీ పొందే కోరుతున్నది

నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ. 


చాటున్నది

మావ కూతురా.. ఆ..ఆ.. ఓ.. ఓ...


వగలమారి బావయ్యా.. రభస చెయ్యకు

పగలు రాత్రి లేకుండా దారి కాయకు

నువ్వు దారి కాసి నలుగురిలో అలుసు చేయకు..ఊ..

నా పరువు తియ్యకు...

వగలమారి బావయ్యా... ఆ.. ఓ.. ఓ..


చరణం: 1

యాతమెక్కుదామన్నా నీ ఊసే ..

అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే...

యాతమెక్కుదామన్నా నీ ఊసే ..

అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే...

పూలు ముడువబోతున్నా నీ ఊసే...

నే చల్ల చిలక బోతున్నా ఆ ధ్యాసే... ఓ.. ఓ.. ఓ..


మావ కూతురా నీతో మాటున్నది

పడుచు గుండె నీ పొందే కోరుతున్నది

నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ. 


చాటున్నది

మావ కూతురా.. ఆ.. ఆ.. ఓ.. ఆ.....


చరణం: 2

పగలంతా కోరికతో తెలవారే...

రేయేమో పగటి కలలు సరిపోయే...

పగలంతా కోరికతో తెలవారే... హాయ్..

రేయేమో పగటి కలలు సరిపోయే...

వలపేమో నీ చెంతకు తరిమింది...

పాడు సిగ్గేమో పగ్గమేసి లాగింది... ఓ..ఓ..


మావ కూతురా నీతో మాటున్నది

పడుచు గుండె నీ పొందే కోరుతున్నది

నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ. 


చాటున్నది

మావ కూతురా.. ఆ..ఆ.. ఏ.. ఓ..


***********


గానం  : SP బాలు , P సుశీల 

రచన  :  మైలవరపు గోపి ,

సంగీతం :  J V రాఘవులు 

చిత్రం :  మనవూరి కథ  (1976)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics