పోస్ట్‌లు

మే, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

శివ తాండవ స్తోత్రం | Shiva Tandava Stotram | Telugu explanation

చిత్రం
శివ తాండవ స్తోత్రం తెలుగు పద్యాలు, తాత్పర్యములు జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 || జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో – మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా – చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- శివుడు – మాకు సకల శుభములను ప్రసాదించుగాక. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 || శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, అందులో సురగంగ వేగంగా సుడులు తిరుగుచున్నది. అప్పుడు దానిలో బారులుతీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లుగొలుపుతుంది. అలాంటి మహాదేవునియందు – నుదుటి భాగమున ధగ ధగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివునిపట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు. ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో...