గరుడగమన తవ చరణకమలమిహ | Garuda Gamana Tava | Divine Lyrics

గరుడగమన తవ చరణకమలమిహ  

( తాత్పర్యముతో)



రచన : జగద్గురు శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి


గరుడగమన తవ చరణకమలమిహ

 మనసి లసతు మమ నిత్యం 

మనసి లసతు మమ నిత్యమ్ ॥


మమ తాపమపాకురు దేవ

 మమ పాపమపాకురు దేవ ॥


జలజనయన విధినముచిహరణ

ముఖ విబుధవినుత పదపద్మ

 విబుధవినుత పదపద్మ ॥

 మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


భుజగశయన భవ మదనజనక 

మమ జననమరణ భయహారీ 

జననమరణ భయహారీ ॥

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


శంఖచక్రధర దుష్టదైత్యహర

 సర్వలోక శరణ సర్వలోక శరణ ॥

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


అగణిత గుణగణ అశరణశరణద

 విదళితసురరిపుజాల 

విదళితసురరిపుజాల ॥

 మమ తాపమపాకురు దేవ

 మమ పాపమపాకురు దేవ ॥


భక్తవర్యమిహ భూరికరుణయా 

పాహి భారతీతీర్థం 'పాహి భారతీతీర్థమ్ ॥

గరుడగమన తవ చరణకమలమిహ

 మనసి లసతు మమ నిత్యం 

మనసి లసతు మమ నిత్యమ్ ॥

 మమ తాపమపాకురు దేవ

 మమ పాపమపాకురు దేవ ॥


తాత్పర్యము


గరుడగమన తవ చరణకమలమిహ

 మనసి లసతు మమ నిత్యం 

మనసి లసతు మమ నిత్యమ్ ॥


ఓ విష్ణు స్వామీ! గరుత్మంతుని  వాహనముగా కలిగినవాడా ! నీ పాదపద్మము ఈ నా మనస్సులో  నిత్యము   ప్రకాశించుగాక ! 

దేవా! నా తాపాన్ని  తొలగించు.(తాపత్రయము: అధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము.)

 దేవా! నా పాపాన్ని తొలగించు


విశేషాలు


పాపాలు 10 

(1. పరద్రవ్యాపేక్ష, 2. అనిష్టచింతనము, 3. వితథాభినివేశము (పరలోకము లేదు, దేహమే ఆత్మయనెడి అభినివేశము) [ఇవి మానస పాపములు],

 4. కఠినోక్తి, 5. అసత్యోక్తి, 6. పరోక్షమున పరదూషణ చేయుట, 7. అసంబద్ధ ప్రలాపము [ఇవి వాచిక పాపములు], 

8. పరద్రవ్యము నన్యాయముగ గ్రహించుట, 9. నిషిద్ధ హింస, 10. పరదారగమనము [ఇవి శరీర పాపములు]


1.జలజనయన విధినముచిహరణ

ముఖ విబుధవినుత పదపద్మ

 విబుధవినుత పదపద్మ ॥

 మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


1. ఓ    పద్మములు వంటి కన్నులు కలవాడా ! బ్రహ్మ ఇంద్రుడు మొదలైన  వారు  సేవించు    పాదపద్మములుగల దేవా !

దేవా! నా తాపాన్ని  తొలగించు.

 దేవా! నా పాపాన్ని తొలగించు


2.భుజగశయన భవ మదనజనక 

మమ జననమరణ భయహారీ 

జననమరణ భయహారీ ॥

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


2. ఆదిశేషునిపై పడుకొన్నవాడా  ! మదనజనకా! నీవు నా జనన మరణభయమును తొలగించు (మోక్షాన్ని ప్రసాదించమని భావం)

దేవా! నా తాపాన్ని  తొలగించు.

 దేవా! నా పాపాన్ని తొలగించు


3. శంఖచక్రధర దుష్టదైత్యహర

 సర్వలోక శరణ సర్వలోక శరణ ॥

మమ తాపమపాకురు దేవ 

మమ పాపమపాకురు దేవ ॥


3. శంఖము, చక్రము ధరించిన వాడా! దుర్మార్గులైన రాక్షసులను హరించినవాడా !  సర్వలోకములకు  శరణము ఇచ్చువాడా ! 

దేవా! నా తాపాన్ని  తొలగించు.

 దేవా! నా పాపాన్ని తొలగించు


4. అగణిత గుణగణ అశరణశరణద

 విదళితసురరిపుజాల 

విదళితసురరిపుజాల ॥

 మమ తాపమపాకురు దేవ

 మమ పాపమపాకురు దేవ ॥


 4. లెక్కించుటకు అ లవికాని గుణ సమూహములు  కలస్వామీ! దిక్కులేనివారికి దిక్కయిన స్వామీ!    రాక్షసులను ముక్కలుముక్కలుచేసిన దేవా! ముక్కలు చేసిన దేవా! 

దేవా! నా తాపాన్ని  తొలగించు.

 దేవా! నా పాపాన్ని తొలగించు


5. భక్తవర్యమిహ భూరికరుణయా 

పాహి భారతీతీర్థం 'పాహి భారతీతీర్థమ్ ॥

గరుడగమన తవ చరణకమలమిహ

 మనసి లసతు మమ నిత్యం 

మనసి లసతు మమ నిత్యమ్ ॥

 మమ తాపమపాకురు దేవ

 మమ పాపమపాకురు దేవ ॥


5. దేవా! మహాదయ తో భక్త శ్రేష్ఠుడయిన  భారతీతీర్థుని  పరిపాలించు.  

నీ పాదపద్మము ఈ నా మనస్సులో  నిత్యము   ప్రకాశించుగాక ! 

దేవా! నా తాపాన్ని  తొలగించు.

 దేవా! నా పాపాన్ని తొలగించు


*********

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram