శ్రీ వినాయక చవితి ప్రార్థన | Sri Vinayaka Chavithi Prardhana | Lyrics | Omkaram

శ్రీ వినాయక చవితి ప్రార్థన



ప్రార్థన:


తొండము నేకదంతమును 

తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 

మెండుగ మ్రోయు గజ్జెలును 

మెల్లని చూపుల మందహాసమున్‌. 

కొండొక గుజ్జురూపమున 

కోరిన విద్యలకెల్ల నొజ్జయై 

యుండెడి పార్వతీ తనయ 

ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథుని 

తలచెదనే విఘ్నపతిని 

దలచినపనిగా 

దలచెదనే హేరంబుని 

దలచెద నా విఘ్నములను 

తొలగుట కొరకున్‌ 


అటుకులు కొబ్బరి పలుకులు 

చిటిబెల్లము నానుబ్రాలు 

చెరకురసంబున్‌ 

నిటలాక్షు నగ్రసుతునకు 

బటుతరముగ విందుచేసి 

ప్రార్థింతు మదిన్‌.  


- ఓం గణేశాయ నమః 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics