పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది | Pellayyindi | Song Lyrics | Manchi Manushulu (1974)

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది




పల్లవి :

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

వయసు ఉరికింది... సొగసు బెదిరింది

పెదవి అదిరింది... పంటానొక్కింది





పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

వయసు ఉరికింది... సొగసు బెదిరింది

పెదవి అదిరింది... పంటానొక్కింది

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది





చరణం 1 :



కమ్మని కల వచ్చింది... ఆ కలకొక రూపొచ్చింది

కమ్మని కల వచ్చింది... ఆ కలకొక రూపొచ్చింది



జరిగినది గురుతొచ్చింది... ఇక జరిగేది ఎదురొచ్చింది

జరిగినది గురుతొచ్చింది... ఇక జరిగేది ఎదురొచ్చింది


కళ్ళకు జత కుదిరింది... కతలెన్నో చెబుతుంది

పెదవి మీద రాసుంది చదివి చెప్పమన్నది



పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది





చరణం 2 :



కుర్రతనం కొత్త రుచులు కోరింది...

రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది



కుర్రతనం కొత్త రుచులు కోరింది...

రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది



గడుసుతనం కొసరిస్తా.. అసలు ఇవ్వనన్నది

ప్రతి రోజు కొసరిస్తే... అసలు మించిపోతుంది


పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది




చరణం 3 :


ఎప్పుడో నన్నిచ్చాను... ఇంకిప్పుడేమి ఇస్తాను

ఇన్నాళ్ళు ఇవ్వనివి... మిగిలి ఎన్నెన్నో ఉన్నవి

ఎప్పుడో నన్నిచ్చాను... ఇంకిప్పుడేమి ఇస్తాను

ఇన్నాళ్ళు ఇవ్వనివి... మిగిలి ఎన్నెన్నో ఉన్నవి



ఇపుడే తెలిసింది... ఎప్పుడేప్పుడని ఉంది

మూడుముళ్ళు వేసినది... ఏడడుగులు నడిచినది

అందుకే... ఆ విందుకే... అహహా... 

అహహా... అహహా... ఆ... ఆ...



పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

వయసు ఉరికింది... సొగసు బెదిరింది

పెదవి అదిరింది... పంటానొక్కింది

పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది

ప్రేమవిందుకు వేళయింది... 

ప్రేమవిందుకు వేళయింది

*********

చిత్రం :  మంచి మనుషులు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics