చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది | Cheyi Cheyi Tagilindi | Song Lyrics | Koduku Kodalu (1972)

 చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది





 పల్లవి:


చేయి చేయి తగిలింది...

హాయి హాయిగా ఉంది

పగలు రేయిగా మారింది....

పరువం ఉరకలు వేసింది

చేయి చేయి తగిలింది...

హాయి హాయిగా ఉంది

పగలు రేయిగా మారింది....

పరువం ఉరకలు వేసింది







చరణం 1:

 

నా వలపే తలుపును తట్టిందీ...

నా వలపే తలుపును తట్టిందీ...

నీ మనసుకు మెలుకువ వచ్చింది...

నీ వయసుకు గడియను తీసింది...

నీ పిలుపే లోనికి రమ్మందీ...

నీ పిలుపే లోనికి రమ్మందీ...

నా బిడియం వాకిట ఆపింది

నా సిగ్గే మొగ్గలు వేసింది...




చేయి చేయి తగిలింది...

హాయి హాయిగా ఉంది

పగలు రేయిగా మారింది....

పరువం ఉరకలు వేసింది

 

 

చరణం 2:

 

సిగ్గుతో నీవు నిలుచుంటే...

నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే

సిగ్గుతో నీవు నిలుచుంటే...

నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే

ఊపిరాడక నా మనసు...

ఉక్కిరిబిక్కిరి అయ్యింది




వాకిట నేను నిలుచుంటే ...

ఆకలిగా నువు చూస్తుంటే

వాకిట నేను నిలుచుంటే ...

ఆకలిగా నువు చూస్తుంటే

ఆశలు రేగి నా మనసు...

అటు ఇటు గాక నలిగింది




చేయి చేయి తగిలింది...

హాయి హాయిగా ఉంది

పగలు రేయిగా మారింది....

పరువం ఉరకలు వేసింది

 

 

చరణం 3:

 

నీ చూపే మెత్తగ తాకింది...

నీ చూపే మెత్తగ తాకింది....

నా చుట్టూ మత్తును చల్లింది

నిను చూస్తూ ఉంటే చాలంది....

నీ సొగసే నిలవేసింది....

నీ సొగసే నిలవేసింది....

నా మగసిరికే సరితూగింది....

నా సగమును నీకు ఇమ్మంది

లా..లా..లా..లా..లా..




చేయి చేయి తగిలింది...

హాయి హాయిగా ఉంది

పగలు రేయిగా మారింది....

పరువం ఉరకలు వేసింది

*********

చిత్రం : కొడుకు కోడలు (1972)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram