గలగల పారుతున్న గోదారిలా | Gala Gala Paruthunna Godarila | Song Lyrics | Gowri (1974)

 గలగల పారుతున్న గోదారిలా





చిత్రం :  గౌరి (1974)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు


పల్లవి :


గలగల పారుతున్న గోదారిలా


రెపరెపలాడుతున్న తెరచాపలా


ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా


ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..


గలగల పారుతున్న గోదారిలా 


చరణం 1 :


అందాల పందిరి వేసే ఈ తోటలూ.. 


ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ


నాగలి పట్టే రైతులూ..  కడవలు మోసే కన్నెలూ


బంగరు పంటల సీమలూ.. చూడరా..  హే..  

    

గలగల పారుతున్న గోదారిలా


రెపరెపలాడుతున్న తెరచాపలా


ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా


ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..


గలగల పారుతున్న గోదారిలా 


చరణం 2 :


దేశానికాయువు పోసే ఈ పల్లెలూ.. 


చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ


సత్యం ధర్మం నిలుపుటే.. న్యాయం కోసం పోరుటే


పేదల సేవలు చేయుటే..  జీవితం.. హే.. 



గలగల పారుతున్న గోదారిలా


రెపరెపలాడుతున్న తెరచాపలా


ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా


ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..


గలగల పారుతున్న గోదారిలా




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | Yenungunekki | Padyam | Narthanasala (1963)

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Song Lyrics | Kondaveeti Donga (1990)

మావూళ్లో ఒక పడుచుంది | Maa vullo oka paduchundi | Song Lyrics | Avekallu (1967)