నువ్వూ నేనూ ఏకమైనాము | Nuvvu Nenu Ekamainamu | Song Lyrics | Koduku Kodalu (1972)

నువ్వూ నేనూ ఏకమైనాము 






పల్లవి:

 

నువ్వూ నేనూ ఏకమైనాము...

నువ్వూ నేనూ ఏకమైనాము...

ఇద్దరము...మనమిద్దరము ఒక లోకమైనామూ...

లోకమంతా ఏకమైనా వేరు కాలేము...

వేరు కాలేము...

నువ్వూ నేనూ ఏకమైనాము....

 
 

చరణం 1:

 

కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ...

అందులో మన చల్ల చల్లని 

వలపు దీపం నిలుపుకుంద్దాము...

 

కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ...

అందులో మన చల్ల చల్లని 

వలపు దీపం నిలుపుకుంద్దాము...

 

పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము...

ఊ..ఉ..

అందులో మన పడుచు కోర్కెల 

మల్లెపూలు పరుచుకుంద్దాము...ఊ..ఉ..

 

నువ్వూ నేనూ ఏకమైనాము....

 

 

చరణం 2:

 

చెలిమితో ఒక చలువపందిరి వేసుకుంద్దాము...

కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుంద్దాము...ఊ..

 

ఆ అల్లికలను మన జీవితాలకు పోల్చుకుంద్దాము...

ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుద్దామూ...ఊ..ఊ..

 

నువ్వూ నేనూ ఏకమైనాము....

 

 

చరణం 3:

 

లేత వెన్నెల చల్లదనము 

నువ్వు తెస్తావూ...ఊ..

అందులో నీరెండలోని వెచ్చదనము 

నువ్వు ఇస్తావు...

 

లేత వెన్నెల చల్లదనము 

నువ్వు తెస్తావూ...ఊ..

అందులో నీరెండలోని వెచ్చదనము 

నువ్వు ఇస్తావు...

 

సూర్యచంద్రులు లేని జగతిని 

సృష్టి చేద్దాము...ఊ..ఊ..

అందులో ఈ సృష్టికెన్నడు 

లేని సొగసు మనము తెద్దాము...

 

నువ్వూ నేనూ ఏకమైనాము...

ఇద్దరము...మనమిద్దరము 

ఒక లోకమైనామూ...

లోకమంతా ఏకమైనా వేరు కాలేము...

వేరు కాలేము...

నువ్వూ నేనూ ఏకమైనాము....

ఆహ..హా..ఆహ..ఆహ..హా...

**********



చిత్రం: కొడుకు కోడలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram